: చంద్రబాబు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి: వైగో


శేషాచలం ఎన్ కౌంటర్ లో చనిపోయిన కూలీల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని ఎండీఎంకే నేత వైగో డిమాండ్ చేశారు. ఏపీ జైళ్లలో ఉన్న తమ కూలీల బాధ్యత తమిళనాడు ప్రభుత్వానిదేనని వైగో స్పష్టం చేశారు. ఇది అంతం కాదు ఆరంభమని ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల సినిమా డైలాగులు చెబుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు మానవత్వానికి దూరంగా ఉన్నాయని మండిపడ్డారు. చిత్తూరు కలెక్టరేట్ ను ముట్టడించేందుకు ప్రస్తుతం వేలూరు నుంచి బయలుదేరిన వైగో, ఆయన బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News