: శేషాచలం ఎదురుకాల్పుల మృతులకు శవపరీక్షపై మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం
శేషాచలం ఎదురుకాల్పుల మృతులకు శవపరీక్షపై మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆరు మృతదేహాలకు మరోసారి శవపరీక్షలు నిర్వహించాలని వ్యాజ్యంలో కోరారు. వెంటనే వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు, శవపరీక్షల విషయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఏపీ హైకోర్టులో వ్యాజ్యం ఉన్నందున అవసరమైతే ఇంప్లీడ్ అవ్వాలని సూచించింది. ఈ నెల 17 వరకు మృతదేహాలను భద్రపరచాలని కక్షిదారులు కోరగా, తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రిలో 6 మృతదేహాలను భద్రపరచాలని కోర్టు ఆదేశించింది.