: ఎవరెస్ట్ పర్వతంపై సొరంగం నిర్మాణానికి చైనా సన్నాహాలు... ఆందోళనలో భారత్!
నేపాల్ కు రైలు మార్గాన్ని నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న చైనా ముందడుగు వేసింది. చైనాలోని లహ్సా నుంచి ఖాట్మండుకు లైన్ వేయాలని, మధ్యలోని పర్వతాలను దాటేందుకు సొరంగాలు నిర్మించాలని భావిస్తున్నట్టు 'చైనా డైలీ' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందులో భాగంగా ప్రపంచంలోని ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతానికి భారీ సొరంగాన్ని తవ్వాలని నిర్ణయించింది. టిబెట్ పరిధిలోకి వచ్చే కొమోలంగ్మా ప్రాంతంలో అత్యంత పొడవైన టన్నెల్స్ నిర్మించాల్సి ఉందని చైనా రైల్వే నిపుణుడు వాంగ్ మెంగ్ షూ తెలిపారు. పర్వత ప్రాంతం కాబట్టి రైళ్లు 120 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించగలవని ఆయన తెలిపారు. ఈ రైల్వే లైన్ నిర్మాణంతో భారత భద్రతకు, ప్రయోజనాలకూ ముప్పు వాటిల్లవచ్చని ఆందోళన వ్యక్తం అవుతోంది.