: చిత్తూరు ముట్టడికి కదిలిన వైగో... అడ్డుకుంటున్న పోలీసులు
శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం దొంగల ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ, వందలాది మంది నిరసనకారులతో తమిళ నేత వైగో చిత్తూరు ముట్టడికి బయలుదేరారు. చిత్తూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళ పట్టణం వేలూరులో ఆయన కార్యకర్తల సమావేశానికి అనుమతి ఇచ్చిన పోలీసులు, ఆంధ్రా సరిహద్దు వైపు వెళ్లేందుకు మాత్రం వీల్లేదని స్పష్టం చేశారు. ఆయనను సాధ్యమైనంత వరకూ వేలూరు లోనే అడ్డుకోవాలన్నది తమిళ పోలీసుల అభిమతం. ఒకవేళ ఆయన తప్పించుకొని వేలూరు దాటితే ఆంధ్రా సరిహద్దులు దాటి లోపలికి రాకుండా చూసేందుకు బార్డర్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ప్రస్తుతం వేలూరు వీధుల్లో తన అనుచరులతో ఉన్న వైగో చుట్టూ పోలీసులు వలయంలా ఉండి వారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.