: నాంపల్లి కోర్టుకు జగన్... అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో నేడు విచారణకు వచ్చింది. ఈ విచారణకు హాజరయ్యేందుకు జగన్ కొద్దిసేపటి క్రితం కోర్టుకు వచ్చారు. జగన్ తో పాటు కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, ఒంగోలు ఎంపీ, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ ఆడిటర్ విజయసాయి రెడ్డి, పారిశ్రామికవేత్తలు అయోధ్య రామిరెడ్డి, నిత్యానందరెడ్డి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్, దాల్మియా సిమెంట్స్ ప్రతినిధి పునీత్ దాల్మియాలు కూడా కోర్టు విచారణకు హాజరయ్యారు.