: అమెరికాలో తెలంగాణ అసోసియేషన్... పురుడు పోసుకున్న‘టాటా’
అమెరికాలో తెలుగు ప్రజల సంఘాల జాబితాలో మరొకటి చేరింది. తానా, ఆటాల మాదిరిగా ప్రవాస తెలంగాణవాసుల కోసం ‘టాటా’ పేరిట కొత్త సంస్థ ఈ నెల 5న న్యూజెర్సీలో ప్రారంభమైంది. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ పేరిట వెలసిన ఈ సంఘం ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు వేల మంది దాకా ప్రవాస తెలంగాణ వాసులు హాజరయ్యారు. టాటా ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయకు ఆ సంస్థ సభ్యులు రూ.40 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జానపద వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్, మిమిక్రీ ఆర్టిస్టులు శివారెడ్డి, రమేశ్ సందడి చేశారు.