: మోదీ కన్నా బాగా పరిపాలిస్తా: కేజ్రివాల్
ప్రధాని నరేంద్ర మోదీ కన్నా తాను మెరుగైన పాలన అందించగలనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. మోదీ పాలన మాత్రం బడా బాబులను కేంద్రంగా చేసుకొని నడుస్తోందని విమర్శించిన ఆయన, 'ఆప్' ప్రజలను కేంద్రంగా చేసి పాలన సాగిస్తోందని అన్నారు. ప్రస్తుతం తాను ఢిల్లీ ప్రజల సమస్యలపైనే దృష్టిని పెడుతున్నానని, పార్టీలోని అంతర్గత విభేదాలపై కాదని వివరించారు. ఎనిమిది నెలల నరేంద్ర మోదీ పాలనకన్నా 49 రోజుల కేజ్రివాల్ పరిపాలన మెరుగైనదని భావించిన మీదటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమవెంట నిలిచారని అన్నారు.