: ఆఖరి బంతి వరకూ గెలుపు దోబూచులాట... ఒక్క పరుగు తేడాతో డేర్ డెవిల్స్ ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్
టీ-20లో అసలైన మజా రెండో మ్యాచ్ లోనే తెలిసింది. ఆఖరి బంతి వరకూ గెలుపు దోబూచులాడిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుపై ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఛేదించిన లక్ష్యం ఓ మాదిరిదే అయినా కాపాడుకొని ఛాంపియన్లమేనని మరోసారి రుజువు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులతో సరిపెట్టుకుంది. స్మిత్ 34, డుప్లెసిస్ 32, ధోని 30 పరుగులు చేశారు. 151 పరుగుల అసాధ్యంకాని లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అల్బీ మోర్కెల్ 55 బంతుల్లో 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలువగా, అతనికి సహకారం అందించేవారు కరవయ్యారు. చివరి బంతికి సిక్స్ చేసి గెలవాల్సిన ఢిల్లీ జట్టు కేవలం ఫోర్ మాత్రమే సాధించింది. బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన నెహ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది.