: చంద్రబాబును ‘గుడ్డి’గా అనుసరించవచ్చట... ఏపీ ఇంధన విధానంపై కేంద్రం ప్రశంసలు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై కేంద్రం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. విద్యుత్ విధానంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం దేశానికే ఆదర్శమని సాక్షాత్తు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు. ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ఇంధన శాఖ మంత్రుల సదస్సులో గోయల్ కీలకోపన్యాసం చేశారు. ‘‘విద్యుత్ విధానంలో ఏపీ సీఎం చంద్రబాబును ‘బ్లైండ్’గా అనుసరించవచ్చు. సోలార్, విండ్ పాలసీల రూపకల్పనలో ఏపీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. విద్యుత్ పొదుపు, సంరక్షణ చర్యలతో పాటు నష్ట నివారణ చర్యలు చేపట్టడంలోనూ చంద్రబాబు సర్కారు పనితీరు చాలా బాగుంది. ఏపీ రూపొందించిన సోలార్, విండ్ పాలసీలను అన్ని రాష్ట్రాలు అనుసరించడం మంచిది’’ అని ఆయన పేర్కొన్నారు.