: వైఎస్ బతికుంటే...జగన్ కేసులో ఆయనే ఏ1 ముద్దాయి: టీడీపీ అధికార ప్రతినిధి అనురాధ


దివంగత కాంగ్రెస్ నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుపర్తి అనురాధ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వైఎస్ బతికి ఉంటే, జగన్ అక్రమాస్తుల కేసులో ఆయనే ప్రథమ ముద్దాయిగా ఉండేవారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని జగన్ అక్రమాస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులే పేర్కొన్నారని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్ పాదయాత్రకు 12 ఏళ్లు నిండిన సందర్భంగా నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో అనురాధ జగన్ పై ఫైరయ్యారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భూముల వివరాలను తెలుసుకుని, తన అనుచరులకు కట్టబెట్టేందుకే వైఎస్ పాదయాత్ర చేశారని ఆమె ఆరోపించారు.

  • Loading...

More Telugu News