: ఊరకుక్కలు ఊరవతల... కాంగ్రెస్ ఏపీ అవతల: రఘువీరాపై యనమల ఫైర్


రాయితీల పేరిట ప్రభుత్వ సొమ్మును పరిశ్రమలకు దోచిపెడుతున్నారన్న ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విరుచుకుపడ్డారు. ‘‘దోచుకోవడం, దాచుకోవడం... కాంగ్రెస్, వైఎస్ జగన్ లకే చెల్లు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఊర కుక్కలు కరుస్తాయని ఊరు అవతల వదిలిపెట్టి వచ్చేస్తాం. అలాగే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం అవతల పెట్టేశారు’’ అని కూడా యనమల కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని కనీసం ఓ రాజకీయ పక్షంగా కూడా తాము గుర్తించడం లేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News