: పాండిచ్చేరికి పాకిన ఎన్ కౌంటర్ నిరసనలు... తిరుమల డిపో బస్సుకు నిప్పు
చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లో తమిళ కూలీల ఎన్ కౌంటర్ నిరసనలు పాండిచ్చేరికి విస్తరించాయి. గత రాత్రి తిరుమల డిపోకు చెందిన ఓ బస్సుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ దాడిలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు ఎన్ కౌంటర్ పై తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎక్కడికక్కడ తమిళులు నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో పాటు ఆంధ్రాకు చెందిన సంస్థలపై దాడులకు తెగబడుతున్నారు. రెండు వేల మందితో చిత్తూరు కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ఎండీఎంకే నేత వైగో ప్రకటనతో ఇటు ఏపీతో పాటు, అటు తమిళనాడు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.