: కొడిగడుతున్న ప్రధాని మోదీ ప్రాభవం... ఫేస్ బుక్ పేజీకి లక్ష ‘అన్ లైక్’లు!


ప్రజాదరణ విషయంలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి నెటిజన్లు ఒక్కసారిగా షాకిచ్చారు. నిన్నటిదాకా ఆయన ఫేస్ బుక్ ఖాతాకు ‘లైక్’ లు వెల్లువెత్తగా, ప్రస్తుతం ‘అన్ లైక్’ల సంఖ్య పెరిగిపోతోంది. మొన్నటిదాకా మోదీ ఫేస్ బుక్ పేజీని 2.79 కోట్ల మంది నెటిజన్లు లైక్ చేసేవారు. అయితే ఈ నెల 7 నాటికి ఈ సంఖ్య 2.78కోట్లకు పడిపోయింది. అంటే, మోదీ ఫేస్ బుక్ కు లక్ష మేర అన్ లైక్ లు వచ్చాయి. అంతేకాక ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని కూడా తెలుస్తోంది. వివాదాస్పద భూ సేకరణ బిల్లు, పెరిగిపోతున్న రైతు ఆత్మహత్యలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరిసిస్తూ నెటిజన్లు ‘అన్ లైక్’ల రూపంలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్లు తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని, ఫేస్ బుక్ చేపట్టే క్లీన్ డ్రైవ్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చని బీజేపీ నేషనల్ కమ్యూనికేషన్ సెల్ కన్వీనర్ అరవింద్ గుప్తా చెప్పారు. అన్ లైక్ ల సంఖ్య పెరిగినా, ఇప్పటికీ ఫేస్ బుక్ లో అత్యధిక మంది ఫాలో అవుతున్న వ్యక్తుల్లో మోదీనే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News