: ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది: పల్లె రఘునాథ్ రెడ్డి


'లయన్' సినిమా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. 'లయన్' ఆడియో వేడుకలో పాల్గొన్న ఆయన నాలుగోపాటను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ, కొందరు సినిమాలు చేస్తే కొంత కాలం ఉంటాయని, మరి కొందరు సినిమాలు చేస్తే మరింత కాలం నిలిచి ఉంటాయని, నందమూరి 'నటసింహం' బాలయ్య సినిమా చేస్తే చరిత్రలో కనబడుతుందని అన్నారు. ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న 'లయన్' ధాటికి తెలుగు సినిమా చరిత్రలో కొత్త రికార్డులు రూపుదిద్దుకుంటాయని పల్లె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News