: గంభీర్ బ్యాట్ విరిగింది: యువరాజ్


ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గంభీర్ బ్యాట్ విరగడంపై సామాజిక మాధ్యమాల్లో ఛలోక్తులు, కామెంట్లు, షేర్లతో పండగ చేసుకుంటున్నారు. వీటికి యువీ వ్యాఖ్యలు తోడవ్వడంతో అంతా సరదాగా జోకులేసుకుంటున్నారు. ముంబై ప్రధాన బౌలర్ వినయ్ కుమార్ వేసిన బంతిని లాంగ్ ఆఫ్ మీదుగా గౌతమ్ గంభీర్ కొట్టే ప్రయత్నం చేశాడు. సరిగ్గా మిడిల్ లో తగిలిన బంతి బ్యాట్ ను రెండు ముక్కలు చేసింది. దీనిపై 'గౌతమ్ బ్యాటు విరిగింది' అంటూ యువరాజ్ సింగ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు. దీనికి నవ్వుకున్న అభిమానులు, బ్యాటు విరిగినా మ్యాచ్ గెలిచాడుగా? అంటూ రిటార్ట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు షేర్ చేస్తూ, వీటికి మరిన్ని ద్వంద్వార్థ కామెంట్లు జత చేస్తూ సోషల్ మీడియాలో గౌతీ బ్యాటు విరిగిన అంశం పెద్ద టాపిక్ అయి కూర్చుంది.

  • Loading...

More Telugu News