: ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న కళారూపం


కెనడాలోని పశ్చిమ తీర ప్రాంతంలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లోని వాంకోవర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ కళారూపం ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. అభివృద్ధి కారణంగా ప్రపంచం వేగంగా మారిపోతోంది. దట్టమైన అటవీ ప్రాంతాలు కాంక్రీటు జంగిల్స్ గా మారిపోతున్నాయి. ప్రాణవాయువు, నీడనిచ్చే చెట్ల స్థానంలో బహుళ అంతస్తుల భవంతులు పెరిగిపోతున్నాయి. ఓ మాదిరి నగరం నుంచి మెట్రోనగరాల వరకు అన్ని పట్టణాల్లో ట్రాఫిక్ జామ్ లు పెరిగిపోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని వాంకోవర్ ప్రాంతానికి చెందిన మార్కన్ బౌకాట్ అనే కళాకారుడు వినూత్నమైన కళారూపం ఏర్పాటు చేశాడు. బాగా ఎదిగిన చెట్టును నరికేసి, కేవలం మోడును మాత్రమే మిగిల్చి దానిపై ఒకదానిపై ఒకటి ఐదు కార్లను పేర్చినట్టు రూపొందించాడు. చెట్లను నరికేస్తూ, వాటి స్థానంలో బహుళ అంతస్తుల భవనాలు, కార్లను నింపేసి ప్రకృతిని ఎలా నాశనం చేసిందీ ఈ కళా రూపకం ద్వారా కళ్లకు కట్టినట్టు వివరించాడు. సృజనాత్మకతతో రూపొందించిన ఈ కళాఖండం అందర్నీ ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News