: అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాలకు ఊరట... వారిపై గృహ హింస కేసు కొట్టివేత
గృహ హింస కేసులో బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా, కుమార్తె ట్వింకిట్ ఖన్నా, అల్లుడు, నటుడు అక్షయ్ కుమార్ కు ఊరట లభించింది. వారిపై ఉన్న ఈ కేసును బాంబే హైకోర్టు కొట్టి వేసింది. తనను గృహ హింసకు గురి చేస్తున్నారంటూ ఖన్నా భాగస్వామి అనితా అద్వానీ రెండేళ్ల కిందట మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఖన్నా చనిపోయాక ముంబయిలోని ఆయన 'ఆశీర్వాద్' బంగ్లా నుంచి వెళ్లగొట్టారంటూ, ఈ నేపథ్యంలో తనకు నెలవారీ ఖర్చులు, బాంద్రాల్లో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇవ్వాలని అనిత కోరారు. దాంతో డింపుల్, ట్వింకిల్, అక్షయ్ లకు నోటీసులిచ్చిన మేజిస్ట్రేట్, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తరువాత వారు తమపై జరుగుతున్న విచారణను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.