: విదేశీ నిధులు స్వీకరించకుండా 'గ్రీన్ పీస్ ఇండియా'పై నిషేధం
పంటపొలాల్లో రసాయనాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 'గ్రీన్ పీస్ ఇండియా' విదేశీ నిధులు స్వీకరించకుండా నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ సంస్థకు ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ చట్టం ప్రకారం గతంలో జారీ చేసిన అనుమతులను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు నోటీసులు పంపుతూ, రిజిస్ట్రేషన్ ను ఎందుకు రద్దు చేయకూడదో వెల్లడించాలని కోరింది. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహా కోరుతున్నట్టు గ్రీన్ పీస్ ఇండియా తెలిపింది. తమ దస్త్రాలు పూర్తి పారదర్శకమని పేర్కొంది. తాము మొత్తం రూ. 30.36 కోట్లను నిధులుగా స్వీకరిస్తే, రూ. 20.76 కోట్లు ఇండియాలోని అభిమానుల నుంచి వచ్చాయని తెలిపింది. మిగతా నిధుల్లో అత్యధిక భాగం తమ మాతృ సంస్థ గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చాయని వివరించింది.