: షూటింగ్లో చిందేసిన జార్ఖండ్ డిప్యూటీ కమిషనర్... ప్రకంపనలు రేపిన వీడియో


ఓ సినిమా షూటింగ్ లో ఐఏఎస్ అధికారి చేసిన అసభ్య నృత్యాల వీడియో జార్ఘండ్ రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. ఒక గ్రామంలో జరిగిన 19 మంది ఊచకోత ఘటన ఆధారంగా 'చిల్కారి ఏక్ దర్ద్' పేరిట చిత్రం తెరకెక్కుతుండగా, డిప్యూటీ కమిషనర్ దినేష్ ప్రసాద్ ఈ చిత్రంలో నటించేందుకు వెళ్లి సినీ డ్యాన్సర్లతో కలిసి చిందులేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి రాగా, విమర్శలు వెల్లువెత్తడంతో దినేష్ ను ప్రభుత్వం వేరే శాఖకు బదిలీ చేసింది. డ్యూటీ అయిపోయిన తర్వాత సినిమాలో నటిస్తే తప్పేముందని దినేష్ ప్రసాద్ తన వైఖరిని సమర్థించుకున్నారు. వాస్తవానికి 2007 హత్యాకాండ నుంచి త్రుటిలో తప్పించుకున్న మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ సోదరుడు నూను మరాండీ తమ కథనే సినిమాగా రూపొందిస్తున్నారని ఆరోపిస్తూ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిని అవమానపర్చేదిగా, వారి బంధువుల సెంటిమెంటును దెబ్బతీసేదిగా సినిమా దృశ్యాలున్నాయని ఆయన ఆరోపణ. కాగా, అప్పటి దాడిలో బాబూలాల్ మరాండీ కుమారుడితో పాటు ఒకే గ్రామానికి చెందిన 19 మంది హతమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

  • Loading...

More Telugu News