: 'బిగ్ యాంబిషన్'ను ప్రారంభించిన చంద్రబాబు
ఏపీలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, అవసరమైన ఈ-సాఫ్ట్ వేర్ ను అందించే 'బిగ్ యాంబిషన్' వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ వాహనం ఏపీలోని 15 పట్టణాల్లో నెలకొన్న పరిశ్రమలకు ఎస్ఏపీ (శాప్) సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. చిన్న తరహా పరిశ్రమలకు భారంగా మారిన ఈ-సాఫ్ట్ వేర్, స్కిల్ డెవలప్ మెంట్ సేవలను అతి చౌకగా 'బిగ్ యాంబిషన్' ప్రాజెక్టు ద్వారా అందిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. ఎస్ఎంఈలకు మల్టీ నేషనల్ కంపెనీలు ఉపయోగిస్తున్న అత్యాధునిక సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని వివరించారు.