: మీడియాపై మంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలకు కట్జూ స్పందన!
జర్నలిస్టులందర్నీ 'presstitutes' అంటూ వ్యాఖ్యానించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగే వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జు స్పందించారు. వారిలో మెజారిటీ సంఖ్యలో అదే వర్గం (presstitutes) కిందకు వస్తారన్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలను తాను అంగీకరించనని తన బ్లాగులో పేర్కొన్నారు. "మీడియా వ్యక్తులందరూ 'presstitutes' అని జనరల్ వీకే సింగ్ అని ఉంటే నేను అంగీకరించను. జర్నలిస్టుల్లో అతికొద్ది మందిగా వున్న నిజాయతీ వ్యక్తులు నాకు తెలుసు. ఉదాహరణకు పి.సాయినాథ్ (ప్రముఖ జర్నలిస్ట్). కానీ, వాళ్లంతా మినహాయింపు. ప్రెస్ కౌన్సిల్ లో ఉన్నప్పటి నా అనుభవం ప్రకారం అత్యధిక భాగం మీడియా వ్యక్తులు కచ్చితంగా జనరల్ వీకే సింగ్ పేర్కొన్న వర్గం కిందకే వస్తారు. ఇక పెయిడ్ న్యూస్ విషయమేంటి, రాడియా టేప్స్, మొదలైనవి" అని కట్జూ చెప్పుకొచ్చారు.