: యెమన్ కు మద్దతిస్తున్నందుకు ఇరాన్ ను హెచ్చరించిన అమెరికా


అరబ్ దేశం యెమన్ లో విధ్వంసం సృష్టిస్తున్న హుతీ రెబల్స్ కు మద్దతిస్తున్న ఇరాన్ ను అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. అరబ్ దేశాల్లో అస్థిరత్వానికి ఇరాన్ ప్రయత్నిస్తోందని, ఆ దేశం కారణంగా ఇబ్బందులు పడే మధ్య ప్రాచ్య దేశాలకు యూఎస్ అండగా నిలుస్తుందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ తెలిపారు. తాజాగా ఇరాన్ రెండు యుద్ధ నౌకలను గల్ఫ్ అఫ్ ఆడెన్ లో మోహరించిన నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా, హుతీ రెబల్స్ కు తాము ఎటువంటి సైన్య సహకారాన్ని అందించడం లేదని ఇరాన్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News