: నెంబర్ 2 ర్యాంకుకు చేరిన సైనా నెహ్వాల్
క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బ్యాండ్మింటన్ మహిళల సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును కోల్పోయింది. మియామీ ఓపెన్ సిరీస్ సెమీ ఫైనల్లో ఒలింపిక్ ఛాంపియన్ లి ఝౌరీ చేతిలో ఓడిపోయి నెంబర్ 2 ర్యాంకుకు చేరింది. తాజాగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీ డబ్ల్యుఎఫ్) అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. గత నెలలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, ఇండియా ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్న ఈ హైదరాబాదీ క్రీడాకారిణి... బ్యాడ్మింటన్ లో నెంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న తొలి మహిళగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా సింగపూర్ ఓపెన్ లో పాల్గొనకుండా సైనా తానుగా విరామం తీసుకుంది. మరోవైపు గాయంతో బాధపడుతున్న మరో క్రీడాకారిణి పీవీ సింధు 9వ ర్యాంకులో కొనసాగుతోంది. ఇక పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ 4వ ర్యాంకు, కామన్ వెల్త్ గేమ్స్ ఛాంపియన్ పారుపల్లి కశ్యప్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 15వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. అటు మహిళల డబుల్స్ లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప ఓ స్థానం మెరుగుపర్చుకుని 18వ ర్యాంకులో నిలిచారు.