: రామలింగరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, 5 కోట్ల జరిమానా


సత్యం రామలింగరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. సత్యం కుంభకోణంపై సుదీర్ఘ న్యాయ విచారణ చేపట్టిన న్యాయస్థానం, సత్యం రామలింగరాజు, ఆయన ఇద్దరు సోదరులను దోషులుగా నిర్థారణ చేసింది. ఈ నేపథ్యంలో రామలింగరాజుకు ఏడేళ్ల జైలు శిక్షతో బాటు 5 కోట్ల రూపాయల జరిమానాతో విధించింది. మిగతా దోషులకు కూడా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 2009 జనవరి 7న సత్యం సంస్థలో 7,100 కోట్ల భారీ కుంభకోణం వెలుగు చూసిన అనంతరం, సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు 216 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. వీరందరినీ విచారించిన న్యాయస్థానం నేడు కీలక తీర్పునిచ్చింది. సత్యం కుంభకోణం వెలుగు చూసిన వెంటనే అరెస్టయి, విచారణ ఖైదీగా జైలులో వున్న రామలింగరాజుకు 2011 సెప్టెంబర్ లో బెయిల్ మంజూరైంది.

  • Loading...

More Telugu News