: మళ్లీ టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే డా.రెహమాన్
తెలుగుదేశం పార్టీ తనను ఆదరించి ఎన్నో పదవులు కట్టబెడితే, వాటిని అనుభవించిన తరువాత, పార్టీని వీడి వెళ్లడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పని, దాన్ని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నానని విశాఖపట్టణం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే డా.రెహమాన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆయన తిరిగి టీడీపీ గూటికి చేరారు. గతంలో పార్టీని వీడి తప్పు చేసినందుకు బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని ఈ సందర్భంగా రెహమాన్ తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో నవ్యాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, పార్టీ ఎటువంటి బాధ్యతలు అప్పగించినా వాటిని స్వీకరిస్తానని పేర్కొన్నారు.