: 'మా' ఎన్నిక వివాదంపై విచారణ మరోసారి వాయిదా


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ('మా') అధ్యక్ష ఎన్నిక వివాదంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఎన్నిక వివాదంపై నటుడు మురళీమోహన్ ఈరోజు కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ వీడియో రికార్డును ఎన్నికల అధికారి కోర్టుకు అందజేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతించిన తరువాతే అధ్యక్ష ఎన్నిక ఫలితాలు ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News