: ఐసీసీని శాసిస్తున్న ఆ మూడు దేశాలు: ఎహసాన్ మణి ఆందోళన
క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన కలుగుతోందని ఐసీసీ మాజీ అధ్యక్షుడు ఎహసాన్ మణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఐసీసీని శాసిస్తున్నాయన్నారు. క్రికెట్ లో ఆరోగ్యకరమైన వాతావరణం సన్నగిల్లుతోందని తెలిపారు. తదుపరి వరల్డ్ కప్ (2019) నాటికి పోటీలో పది జట్లే ఉంటాయన్న ఐసీసీ నిర్ణయంపై మణి తీవ్రంగా మండిపడ్డారు. పలు దేశాలు క్రికెట్ ఆడుతుంటే కేవలం 10 జట్లతోనే వరల్డ్ కప్ నిర్వహిస్తాననడం ఎంతవరకూ సరైన నిర్ణయమని ప్రశ్నించారు. క్రికెట్ వ్యాపారంగా మారిందని తెలిపారు. పలు దేశాల జట్లు ఆర్థికంగా తగిన బలంగా లేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు.