: కాశ్మీరీ పండిట్ లకు ప్రత్యేక టౌన్ షిప్ లు సాధ్యం కావు: సీఎం ముఫ్తీ
జమ్ము కాశ్మీర్ లో కాశ్మీరీ హిందువులు లేదా పండిట్ లకు పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక టౌన్ షిప్ ల ఏర్పాటు విషయం వివాదానికి దారితీస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మాట్లాడుతూ, ప్రత్యేక టౌన్ షిప్ లు ఏర్పాటు చేయడం సాధ్యంకాదని ఉద్ఘాటించారు. అందుకోసం ప్రత్యేక భూమి కేటాయించడం కుదరదని, ప్రతిఒక్కరూ కలిసే జీవిస్తారని తాను హోంశాఖ మంత్రికి కూడా చెప్పానన్నారు. మనమంతా వైవిధ్యానికి నిదర్శనని, కానీ ఓ వివాదాన్ని సృష్టించారని ముప్తీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో వివరించారు. వారికోసం జగ్తి తరహా ఫ్లాట్లను నిర్మిస్తామని తెలిపారు. దాంతో పండిట్ లకు ప్రత్యేక టౌన్ షిప్ లు నిర్మించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం వెనుకంజ వేసింది. ఈ విధానాన్ని ఎన్ సీ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శించారు.