: మహిళా డైరెక్టర్ల నియామకంలో వైఫల్యం చెందితే రూ.50వేల జరిమానా: సెబీ
దేశీయ కంపెనీల బోర్డుల్లో ఓ మహిళా డైరెక్టర్ ను తప్పనిసరిగా నియమించుకోవాలంటూ గతేడాది సెబీ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. ఇందుకు గత నెల 31 వరకు గడువు విధించింది. గడువు ముగిసినా ఇంకా నియామకంలో వైఫల్యం చెందిన కంపెనీలకు కనిష్టంగా రూ.50,000 జరిమానా, తరువాత నాలుగు దశల వారీగా జరిమానా పెరుగుతూ ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లపై తదుపరి చర్యలు తీసుకుంటామని తాజాగా సెబీ తెలిపింది. ఇప్పటికే మహిళా డైరెక్టర్ల నియామకంపై కంపెనీలు కుస్తీలు పడుతున్నాయట. తాజాగా జరిమానా, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్న సెబీ హెచ్చరికతో ఈ విషయంపై కంపెనీలు ఏ మేర దృష్టి పెడతాయో చూడాలి.