: యూపీ, ఉత్తరాఖండ్ సర్కారులను కూల్చమన్నారు: మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు


గవర్నర్ పదవి నుంచి దిగేది లేదంటూ నరేంద్ర మోదీ సర్కారును ముప్పుతిప్పలు పెట్టిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అధీనంలోని రెండు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చాలని కొందరు వ్యక్తులు తనపై ఒత్తిడి చేశారని ఆయన బాంబు పేల్చారు. అయితే నిజాయతీ వైపే నిలబడాలని నిర్ణయించుకున్న తాను ఆ పనిచేయలేకపోయానని కూడా ఖురేషీ అన్నారు. ఈ కారణంగానే తాను పదవి కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా తనపై ఒత్తిడి తెచ్చిన వ్యక్తుల మాట విని ఉంటే, ఇప్పటికీ గవర్నర్ పదవిలోనే ఉండేవాడినని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News