: మణిరత్నం చిత్రాన్ని విడుదల చేయొద్దంటూ డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు
దర్శకుడు మణిరత్నం తాజా చిత్రం 'ఓ కాదల్ కన్మణి' (ఓకే కన్మణి). ఈ నెల 17న విడుదలకు సిద్ధం కాబోతోంది. దానికి ముందుగానే ఈ సినిమా విడుదలకు అవాంతరాలొచ్చేలా ఉన్నాయి. ఈ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలంటూ మన్నన్ అనే డిస్ట్రిబ్యూటర్ తమిళ నిర్మాతల మండలిలో, డిస్ట్రిబ్యూటర్ల, ఎగ్జిబ్యూటర్ల సంఘాల్లో ఫిర్యాదు చేశాడు. మణి ఇంతకుముందు రూపొందించిన 'కడల్' చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను అప్పట్లో తాను పొందానని, దాని ద్వారా తీవ్ర నష్టం వాటిల్లడంతో కొనుగోలు చేసిన అప్పును కూడా తీర్చలేకపోతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలాంటి సమయంలో పెద్ద సంస్థలు నిర్మించిన చిత్రాలకు నష్టం వాటిల్లితే మానవతావాదంతో నష్టపరిహారం తిరిగి చెల్లిస్తారని, అదే విధంగా 'కడల్' విషయంలో తనకు ఏర్పడిన నష్టాన్ని మణి ద్వారా భర్తీ చేయించాలని విజ్ఞప్తి చేశాడు. అందుకే అతని కొత్త సినిమా విడుదల చేయవద్దని కోరుతున్నట్టు తెలిపాడు.