: ఈ నెల 23 నుంచి రాజ్యసభ సమావేశాలు
రాజ్యసభ సమావేశాలు ఈ నెల 23 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమావేశాలు నిర్వహించేందుకు ఆమోదించడంతో సమావేశాలు జరగనున్నాయి. మే 13 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. భూసేకరణ ఆర్డినెన్స్ ను తిరిగి ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గత నెలలో పెద్దల సభను రాష్ట్రపతి వాయిదా వేయడం జరిగింది. మరోవైపు లోక్ సభ సమావేశాలు కూడా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 నుంచి మొదలవుతాయి.