: కోర్టుకు చేరిన రామలింగరాజు... సత్యం కుంభకోణంలో కాసేపట్లో తీర్పు
అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. వాస్తవానికి ఈ కేసులో తీర్పును గత సంవత్సరంలోనే వెలువరించాల్సి ఉన్నప్పటికీ మరికొంత సమాచారం సేకరించడంలో భాగంగా వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కేసులో ప్రధాన నిందితుడైన రామలింగరాజుతో పాటు ఆయన సోదరులు, కంపెనీకి చెందిన పలువురు వ్యక్తులు ఈ ఉదయం నాంపల్లి కోర్టు ముందు హాజరయ్యారు. సీబీఐ తరపున డీఐజీ చంద్రశేఖర్ కోర్టుకు వచ్చారు. ఈ కేసులో కోర్టు ఇప్పటికే 216 మంది సాక్షులతోపాటు 3038 డాక్యుమెంట్లను పరిశీలించింది.