: పేరుకే ఫంక్షన్ హాల్... లోపల వన్యప్రాణుల పెంపకం: అక్రమాల పుట్ట సురభీ గార్డెన్స్ సీజ్!
సికింద్రాబాదులోని కంటోన్మెంట్ పరిధిలో పంక్షన్ హాల్ పేరిట కార్యకలాపాలు సాగిస్తున్న సురభీ గార్డెన్స్ అక్రమాల పుట్ట అని తేలిపోయింది. పేరుకు ఫంక్షన్ హాల్ అయిన ఈ గార్డెన్ లో వన్యప్రాణి సంరక్షణ చట్టానికి సదరు గార్డెన్స్ యాజమాన్యం తూట్లు పొడిచింది. నిబంధనలకు విరుద్ధంగా నెమలి తదితర పక్షులను పెంచుతున్న వైనం వెలుగు చూసింది. వన్యప్రాణులను పెంచుతున్నారన్న పక్కా సమాచారంతో అటవీ శాఖాధికారులు, కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి ఉమ్మడిగా దాడి చేశారు. ఈ దాడుల్లో భూ దురాక్రమణలు సహా, వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘనలు కనిపించాయి. దీంతో గార్డెన్స్ ను సీజ్ చేసిన పోలీసులు, యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు.