: హమ్ కో భీ దుఖ్ హై ...!: వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై తెలంగాణ డీప్యూటీ సీఎం అలీ వ్యాఖ్య


ఉగ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ పై తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నిన్న విచిత్రంగా స్పందించారు. తమపై తిరగబడిన కారణంగానే వికారుద్దీన్ గ్యాంగ్ పై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందన్న ఆయన, వికార్ గ్యాంగ్ చట్టపరంగా విచారణను ఎదుర్కుని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ‘‘హమ్ కో భీ దుఖ్ హై. వికారుద్దీన్, అతడి అనుచరుల ఎన్ కౌంటర్ బాధాకరం. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నాను’’ అని కూడా అలీ పేర్కొన్నారు. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు తన సామాజిక వర్గం సభ్యుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఆయన రెండు రకాల వాదనలు వినిపించాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News