: అలంపూర్ లో డ్యూటీ...హైదరాబాదులో అక్రమాస్తుల గుట్టలు: అవినీతి అధికారిపై ఏసీబీ దాడి
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ లంచగొండి అధికారుల భరతం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్న ఏసీబీ అధికారులు లంచాల పేరిట ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న అక్రమార్కులను కటకటాల వెనక్కు నెడుతున్నారు. తాజాగా నేటి ఉదయం రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న శివలింగం అనే అధికారి ఇంటిపై దాడులు చేశారు. హైదరాబాదులోని సరూర్ నగర్ పరిధిలోని ఆయన ఇంటితో పాటు నగరంలోని అతడి బంధువుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ దాడులు చేస్తోంది. సోదాల్లో భాగంగా శివలింగం పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దు అలంపూర్ చెక్ పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న శివలింగం, హైదరాబాదులో అక్రమాస్తులను కూడబెట్టారు.