: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా నసీం జైదీ... 19న బాధ్యతల స్వీకరణ
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి నసీం జైదీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా పనిచేస్తున్న హెచ్ఎస్ బ్రహ్మ ఈ నెల 19న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నసీం జైదీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని పలు కీలక పదవుల్లో పనిచేసిన నసీం జైదీ, 2012, ఆగస్టు 7న కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల నిర్వహణలో ఇటీవల చోటుచేసుకున్న పలు కీలక సంస్కరణల్లో జైదీ కీలక భూమిక పోషించారు.