: కర్నూలుకు నారా లోకేశ్... మాజీ మంత్రి అంత్యక్రియలకు హాజరు!


తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త, ఏపీ సీఎం కుమారుడు నారా లోకేశ్ నేడు కర్నూలు జిల్లా పర్యటనకు వెళుతున్నారు. నిన్న తుదిశ్వాస విడిచిన మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లోకేశ్ కర్నూలు వెళుతున్నారు. 1983లో నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించిన సమయంలోనే రాంభూపాల్ చౌదరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే కొన్ని కారణాల వల్ల చౌదరి టీడీపీని వీడారు. రెండేళ్ల క్రితం తిరిగి ఆయన సొంతగూటికి చేరుకున్నారు. నిన్న మృతి చెందిన రాంభూపాల్ అంతిమ యాత్ర నేడు కర్నూలులో జరగనునంది. చౌదరి అంత్యక్రియలకు పార్టీ తరఫున నారా లోకేశ్ హాజరు కానున్నారు.

  • Loading...

More Telugu News