: డీఎంకే పగ్గాలు స్టాలిన్ కే!: తేల్చిచెప్పిన కరుణానిధి తనయ


తమిళనాట ప్రధాన పార్టీగా వెలుగొందుతున్న ద్రవిడ మున్నేట్ర కజగం త్వరలోనే కొత్త అధినేత కిందకు వెళ్లనుంది. ఏళ్ల తరబడి ఆ పార్టీ అధ్యక్షుడిగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కొనసాగుతూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో కేవలం కుర్చీకే పరిమితమైన కరుణానిధి, ఇకపై పార్టీ బాధ్యతలు మోసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కొత్త సారథి ఎవరనే విషయంపై తమిళనాడులోనే కాక జాతీయ స్థాయిలోనూ పెద్ద ఎత్తున చర్చే నడుస్తోంది. కరుణానిధి పుత్రరత్నాలుగా అళగిరి, స్టాలిన్ లు ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నవారే. అయితే ఇప్పటికే అళగిరి అభ్యర్థిత్వం పట్ల అనుమానాలు పటాపంచలయ్యాయి. దీంతో పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఖాయమన్న వాదన వినిపించింది. అయితే ఒక్కసారిగా దూసుకువచ్చిన కరుణానిధి కూతురు, ఎంపీ కనిమొళి, స్టాలిన్ కు పోటీగా నిలిచారు. వీరిద్దరిలో పార్టీ పగ్గాలు చేపట్టే నేత ఎవరన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ కనిమొళి, ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ బాధ్యతలు స్వీకరిస్తారని విస్పష్టంగా ప్రకటించి ఆ చర్చకు ఆమె తెర దించారు.

  • Loading...

More Telugu News