: కోల్ కతా లక్ష్యం 169


ఐపీఎల్8 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 168 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ అజేయంగా 98 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. అతనికి కోరె ఆండర్సన్ అర్ధ సెంచరీతో చక్కని సహకారమందించడంతో మెరుగైన స్కోరు సాధించింది. ముంబై ఇండియన్స్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలినప్పటికీ కోలుకుని మంచి లక్ష్యాన్ని కోల్ కతా ముందు ఉంచింది. ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మన్ లో ఫించ్ (5), తారే (7), అంబటి రాయుడు (0) విఫలమయ్యారు. రోహిత్ (98), కోరె ఆండర్సన్ (55) రాణించారు. మోర్కెల్ రెండు వికెట్లు తీయగా, షకిబల్ హసన్ ఒక వికెట్ తీశాడు.

  • Loading...

More Telugu News