: ఆసియాకప్ ఛాలెంజర్ సిరీస్ లో పాల్గొనేందుకు భిక్షాటన!


క్రీడల్లో విదేశాల్లో మన పరువు నిలిపేందుకు సమాయత్తమైన హాకీ ఆటగాళ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, వీరు వినూత్నమైన పంథా ఎంచుకున్నారు. అదే భిక్షాటన! ఆ వివరాల్లోకి వెళితే, ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 18 నుంచి కువైట్ లో జరగనున్న ఆసియా కప్ చాలెంజర్ సిరీస్ లో పాల్గొనేందుకు భారత 'ఐస్ హాకీ' జట్టు వెళ్లాల్సి ఉంది. భారత్ లో బీసీసీఐ మినహా మరే క్రీడా సంస్థకూ ఆదరణ లేదు. ఈ నేపథ్యంలో ఖతార్ వెళ్లేందుకు, ప్రిపరేషన్ క్యాంప్ నిర్వహణ కోసం ఇప్పటి వరకు భారత క్రీడా మంత్రిత్వశాఖ ఒక్కపైసా నిధులివ్వలేదు. దీంతో ఐస్ హాకీ జట్టులోని 11 మంది ఆటగాళ్లు తమ స్థోమతకు తగ్గట్టు తలా 20 వేలు వేసుకొని రెండు లక్షల రూపాయలు పోగేశారు. కాగా, ఖతార్ టూర్ కు మొత్తం 12 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. మిగిలిన డబ్బు సేకరించేందుకు వారు సోషల్ మీడియాను ఆశ్రయించారు. వారి విజ్ఞాపనకు స్పందించిన దాతలు మరో ఐదు లక్షల రూపాయలు సమకూర్చారు. ఇంకా 7 లక్షల రూపాయలు కావాల్సి ఉంది. దీంతో ఆవేదన చెందిన ఓ ఐస్ హాకీ ఆటగాడు మాట్లాడుతూ, నేడు తామంతా చేస్తున్న ప్రయత్నం భవిష్యత్ లో ప్రభుత్వాలు, క్రికెట్ ను మాత్రమే వెర్రిగా ప్రేమించే అభిమానుల కళ్లు తెరిపిస్తాయని ఆశిస్తున్నానని అన్నాడు.

  • Loading...

More Telugu News