: నవాన్ షహర్ రైల్వే స్టేషన్ కు భగత్ సింగ్ పేరు
పంజాబ్ లోని నవాన్ షహర్ రైల్వే స్టేషన్ ను షహీద్ భగత్ సింగ్ రైల్వే స్టేషన్ గా పేరు మారుస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలోని ఖట్కార్ కలాన్ గ్రామం భగత్ సింగ్ పూర్వీకులది. నవాన్ షహర్ జిల్లా పేరును గతంలోనే షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాగా మార్చారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వారితో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన అమరవీరులను స్మరించుకునేందుకు, వారిని చిరకాలం గుర్తుంచుకునేందుకు వారి పేరును చిరకాలం గుర్తుండే చర్యలను కేంద్రం చేపట్టింది. ఈ నేఫథ్యంలో భగత్ సింగ్ పేరును రైల్వేస్టేషన్ కు పెట్టింది.