: సికింద్రాబాద్ లోని సురభి గార్డెన్స్ సీజ్


సికింద్రాబాదులోని సురభి గార్డెన్స్ ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు సీజ్ చేశారు. 1962లో గృహావసరాల నిమిత్తం 3.26 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్న సురభి గార్డెన్స్ యజమాని, అనుమతి లేకుండా వాణిజ్యపరమైన అంశాలకు వినియోగించడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా డీజేయింగ్, లైసెన్స్ లేకుండా ఫంక్షన్ హాల్ నిర్వహించడం, దానిని సబ్ లీజుకివ్వడం, ఫంక్షన్ల తరువాత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోవడంపై కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్యప్రాణి చట్టాలను అతిక్రమించడాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో తక్షణం సురభి గార్డెన్స్ ను సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News