: పదేళ్లలో గ్రహాంతర వాసుల జాడ కనిపెడతాం: నాసా
రానున్న పదేళ్లలో గ్రహాంతర వాసుల జాడ కనిపెడతామని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మరో ఇరవైఏళ్లలో గ్రహాంతర వాసులు ఉన్నారనే పక్కా సాక్ష్యాధారాలు చూపిస్తామని నాసా శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు. గ్రహాంతర జీవనం, నివాసయోగ్యమైన గ్రహాల అన్వేషణకు సంబంధించిన నాసా ప్యానెల్ సమావేశంలో సీనియర్ శాస్త్రవేత్త ఎలెన్ స్టొఫన్ తెలిపారు. మన సౌరవ్యవస్థతో పాటు ఆవల కూడా జీవనానికి సంబంధించిన జాడలు అతి త్వరలో కనుక్కుంటామని మరోశాస్త్రవేత్త జాన్స్ గ్రున్స్ ఫీల్డ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సౌరవ్యవస్థ, దాని ఆవల జీవనానికి మద్దతిచ్చే వాతావరణం అక్కడక్కడ ఉన్నట్టు ఈ మధ్య పరిశోధనల్లో వెలుగుచూసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అంగారకుడిపై ఒకప్పుడు నీరు ఉండేదని ఆయన తెలిపారు.