: భవిష్యత్తులో భారత్, చైనా మధ్యే పోటీ: చంద్రబాబు
అభివృద్ధి పరంగా భవిష్యత్తులో భారత్, చైనా మధ్య ప్రధాన పోటీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖపట్టణంలోని ఆంధ్రయూనివర్సిటీలోని నాలెడ్జ్ మిషన్ ప్రారంభకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మనదేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని అన్నారు. తెలుగు జాతికి మంచి రాజధాని నగరం కావాలన్నది తన ఆకాంక్ష అని ఆయన తెలిపారు. హుదూద్ తుపానును చూసి చాలా భయపడ్డామని, కేవలం తొమ్మిది రోజుల్లో సాధారణ స్థితికి తీసుకువచ్చామని ఆయన చెప్పారు. ఏదైనా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే, విజయం సాధించడం కష్టం కాదని ఆయన చెప్పారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా, వాటికి ఎదురీది విజయం సాధించాలని ఆయన ఉద్బోధించారు.