: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఐఎస్ఐఎస్ అకృత్యం
తాము చేసిన అకృత్యాలను బాహ్యప్రపంచానికి తెలియజేయడానికి కరుడుగట్టిన తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సోషల్ మీడియాను వినియోగించుకుంటోంది. ఐఎస్ఐఎస్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాంత్రిక పూజలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తిని ఇరాక్ లోని తిక్రీత్ నగర నడిబొడ్డున మేకను నరికినట్టు నరికేసిన ఘటన దృశ్యాలు ఆందోళన రేపుతున్నాయి. డీ గెర్రీ అబూబకర్ అల్ బ్రిటాని గా చెప్పుకున్న ఓ ఉగ్రవాది పోస్టు చేసిన ఫోటోల్లో ఒకదానిలో, నడివయస్కుడు జంతువులను నరికే మొద్దుపై తలపెట్టి ఉండగా, అతను కత్తిపట్టుకుని నరుకుతున్న దృశ్యం వుంది. రెండో ఫోటోలో తల, మొండెం విడివిడిగా పడి వున్నాయి. కాగా, చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలకు కూడా ఇలాంటి శిక్షలే అమలులో ఉండడం విశేషం. సద్దాం హుస్సేన్ సైన్యంలో పనిచేసిన అనేకమంది కమాండర్లు ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు నాయకత్వం వహిస్తున్నారు.