: సార్క్ దేశాల్లో పోలియో నిర్మూలనకు భారత్ సహకారం
సార్క్ దేశాల్లో పోలియో నిర్మూలనకు భారత్ సహకారం అందిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సార్క్ దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల ఐదో సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సార్క్ దేశాలు పోలియో రహిత దేశాలుగా మారేందుకు తగిన సహకారం అందిస్తామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్యంపై అన్ని దేశాలు కలిసికట్టుగా పయనించాలని ఆయన సూచించారు. ప్రాణాంతక వ్యాధుల నిర్మూలనే ధ్యేయంగా అన్ని దేశాలు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.