: శేషాచలం మృతులకు తమిళనాడు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా


చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎన్ కౌంటర్ అయిన కూలీలకు తమిళనాడు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతి చెందిన ఒక్కో కూలీ కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాగా అందజేయనున్నామని తమిళనాడు ప్రభుత్వం తెలిపిింది. కాగా, తిరుపతి ఎన్ కౌంటర్ కు ముందు జరిగిన ఘటనల సీసీటీవీ పుటేజ్ ను చిత్తూరు జిల్లా అటవీశాఖాధికారులు విడుదల చేశారు. ఈ వీడియోల్లో స్మగ్లర్లకు కూలీలు సహకరిస్తున్నట్టు కనపడుతోంది. నరికేసిన ఎర్రచందనం దుంగలను స్మగ్లర్ల దగ్గరకు చేరవేస్తున్న కూలీలు వీడియోలో కనపడ్డారు.

  • Loading...

More Telugu News