: అధికారులను చంపినప్పుడు ఏమైపోయారు?: ఎన్‌ కౌంటర్‌ పై రాజకీయ పార్టీల వైఖరిని ప్రశ్నించిన పోలీసు సంక్షేమ సంఘం


తిరుపతి సమీపంలో ఎన్‌ కౌంటర్‌ పై రాజకీయ పార్టీలు చేస్తున్న రాద్ధాంతాన్ని పోలీసుల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోకుండానే రాజకీయం చేయడం శోచనీయమని పేర్కొంది. కాల్పుల్లో మరణించినవారి కులమతాలు, ప్రాంతం తాము చూడలేదని, వారంతా అపారమైన సంపదను కొల్లగొట్టేందుకు వచ్చిన స్మగ్లర్లు మాత్రమేనని తెలిపింది. ఎర్రచందనం దొంగల కుల, మతాలు పార్టీలకు ఎలా తెలుసని ప్రశ్నించింది. దొంగలకు మద్దతిస్తున్నట్టు మాట్లాడుతున్న రాజకీయ పార్టీల నేతలే వారిని అడవులకు పంపారా? అని ప్రశ్నించింది. గతంలో అధికారులను చంపినప్పుడు ఈ పార్టీలు ఎందుకు మాట్లాడలేదని పోలీసు సంక్షేమ సంఘం ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News