: శేషాచలం ఎన్ కౌంటర్ లో ప్రభుత్వ చర్య సమర్ధనీయమే: గాలి ముద్దుకృష్ణమ


చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ప్రభుత్వ చర్య సమర్ధనీయమేనని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. శేషాచలం నుంచి ఇప్పటివరకు రూ.50వేల కోట్ల ఎర్రచందనం దొంగలపాలైందని చెప్పారు. దొంగల విషయంలో తమిళనాడు ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఆయన మీడియా సాక్షిగా కోరారు. అటవీ అధికారులను చంపినప్పుడు కాంగ్రెస్, వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని గాలి ప్రశ్నించారు. ఎర్రచందనం కాపాడుకుంటేనే ఏపీ అభివృద్ధి అన్న గాలి, రాష్ట్రం కోసం పోలీసులు చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News